బింబిసార… ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హిట్ దక్కిన సినిమా. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బింబిసార హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ… నాకిది పునర్జన్మ అంటూ వ్యాఖ్యానించాడు. ట్రైలర్ నుంచి మొదలు పెడితే… సినిమా విడుదల వరకూ ప్రేక్షకులు, అభిమానులు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు ప్రకటించాడు. ఇండస్ట్రీ నుంచి చాలా మంది మెచ్చుకుంటూ తనకు కాల్స్ చేస్తున్నారని, ఈ రకంగా నటుడిగా బింబిసార తనకు పునర్జన్మ ఇచ్చిందన్నారు.
ఇకపై ఏ సినిమా చేసినా… కొత్తదనం వుండేలా చూసుకుంటానని, మంచి కంటెంట్ తీస్తే ప్రజలు ఆదరిస్తారన్న విషయం ఎప్పుడూ వుంటుందని అన్నాడు. దిల్ రాజు కూడా బింబిసార సినిమాపై సంత్రుప్తి వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ప్రేక్షకులు సినిమా థియేటర్లకే రావడం లేదని, ఈ సమయంలో బింబిసార, సీతారామం సినిమాలు కొత్త ఊపిరిని పోశాయని పేర్కొన్నాడు. హీరో, దర్శకుడు, నిర్మాత కలిసి పనిచేస్తే సక్సెస్ వస్తుందన్నాడు.