Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నడుస్తుండగా… కిందపడిపోయిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కాలుజారి కిందపడిపోయారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత నడుస్తుండగా… ఆమెకు మ్యాట్ తట్టుకుంది. దీంతో సడెన్ గా కింపడిపోయారు. దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది తేరుకున్నారు.

 

అధికారులు, సెక్యూరిటీ సాయంతో గవర్నర్ లేచి నిల్చున్నారు. తర్వాత యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు గవర్నర్. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనపై తమిళిసై చమత్కరిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాను కింద పడిపోవడం మాత్రం పెద్ద వార్త అవుతుందన్నారు. దీనితో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు.

Related Posts

Latest News Updates