నవీన్ హత్య కేసులో హాసన్, నిహారికకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్ హత్య కేసులో వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని హయత్ నగర్ న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. నిహారికను ఏ2, హసన్ ను ఏ3 గా పోలీసులు చేర్చారు. వీరిద్దరికీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో నిహారికను చంచల్ గూడకు, హసన్ కి చర్లపల్లి జైలుకు తరలించారు.
హత్య చేసిన రోజు రాత్రి హరిహరకృష్ణ, హస్సేన్ ఇద్దరు కలిసి హత్య చేసిన ప్రదేశానికి వెళ్లి నవీన్‌నాయక్ శరీర భాగాలను తీసుకుని మన్నెగూడ ప్రాంతంలో వేశారు. ఆ రోజు హస్సేన్ ఇంట్లోనే హరిహరకృష్ణ తలదాచుకున్నాడు. రాత్రి వాట్సాప్ చాటింగ్‌లో తన ప్రియురాలు నిహారికకు ఈ వివరాలు చెప్పి, మరుసటి రోజు 18వ తేదీన హస్తినాపురం, క్రిస్టియన్‌కాలనీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లాడు. హత్య చేసిన విషయాన్ని పూర్తిగా వివరించి, ఆమె వద్ద ఖర్చుల కోసం రూ.1500 తీసుకున్నాడు.