హీరో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం దసరా. రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల థీమ్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు కూడా రిలీజ్ కావడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది. మార్చి 30 న సినిమా రిలీజ్ కానుంది. అయితే… ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, స్థలం కూడా ఖరారైంది. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఈ నెల 26 న ఈ వేడుకను నిర్వహించనున్నారు. దీనిని పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మరోవైపు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు సబ్ టైటిల్స్ సహా అసభ్యకరమైన సంభాషణలకు మ్యూట్ పెట్టాలని, డిస్ క్లైమర్ ఫాంట్ పెంచాలని, వైలెన్స్ అధికంగా వున్న సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలని సూచించింది. మొత్తంగా 16 కట్స్ సూచించింది సెన్సార్ బోర్డు.