ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతిని గవర్నర్ సందర్శించారు. నిమ్స్ కి వెళ్లిన గవర్నర్ తమిళిసై… ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం పరిస్థితి విషమంగా వుందని గవర్నర్ పేర్కొన్నారు. వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని గవర్నర్ తమిళిసై తెలిపారు.
మరోవైపు వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని వైద్యలు తెలిపారు. ప్రీతికి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టు తో చికిత్స అందిస్తున్నామని