బీజేపీ ఇటీవలే బహిష్కరించిన నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అగ్రరాజ్యం స్పందించింది. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని అమెరికా అన్నది. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ ప్రకటించారు. మత విశ్వాసాల విషయంలో గానీ.. మానవ హక్కుల ఆందోళనలపై తాము ఎప్పటికప్పుడు భారత్ తో మాట్లాడుతూనే వున్నామని, సీనియర్ అధికారుల స్థాయిలో చర్చలు చేస్తూనే వున్నామని ప్రైస్ వెల్లడించారు.
మే 26 న ఓ టీవీ ఛానల్ డిబేట్ లో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మమహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న దుమారం రేగిన విషయం తెలిసిందే. గల్ఫ్ నుంచి, ముస్లిం దేశాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నుపుర్ శర్మతో పాటు మరో బీజేపీ నేత నవీన్ జిందాల్ పై కూడా బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే.