ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖా పులివెందులలో కాల్పుల కలకలం రేగింది. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. జరిపిన కాల్పుల్లో దిలీప్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దిలీప్ ను రిమ్స్ కి తరలిస్తుండగా మరణించాడు. మరో వ్యక్తి మహబూబ్ బాషా పులివెందుల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరోవైపు భరత్, దిలీప్ మధ్య ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నాయి. భరత్ దగ్గర దిలీప్ అప్పు తీసుకున్నాడు. తన డబ్బులు ఇవ్వాలంటూ భరత్ గట్టిగా నిలదీశాడు. ఈ డబ్బుల వ్యవహారంలో గొడవ చోటుచేసుకోవడంతో దిలీప్, బాషాపై భరత్ తుపాకీ తీసి కాల్పులకు పాల్పడ్డాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో దిలీప్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే… అక్కడే వున్న దిలీప్ స్నేహితుడు మహబూబ్ బాషా అడ్డుకునే ప్రయత్నం చేయగా… అతడిపై కాల్పులు జరిపాడు.