ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్లు వచ్చిన వార్తలపై దర్శకుడు మారుతి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ తో చేసే చిత్రంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిత్రం చేయడంపై ప్రభాస్ తో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు. ఆయనతో మంచి వినోదాత్మక చిత్రం తీయాలన్న ప్లాన్ లో ఉన్నానని మారుతి వెల్లడించారు.
డార్లింగ్, బుజ్జిగాడు సినిమాల్లో ప్రబాస్ ఎంత యాక్టివ్ రోల్స్ లో కనిపించాడో… అంతే యాక్టివ్ రోల్ లో ప్రభాస్ ను తీయాలన్నది తన కోరిక అన్నాడు. అయితే.. తాను తీసే సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో ఉత్తేజాన్నిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పటికే తన సినిమా నేపథ్యం, హీరోయిన్, తారాగణంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయని, అవి నిజం కావని కొట్టిపారేశారు. తాను కూడా ప్రభాస్ ఫ్యాన్ అని, దీనిని గమనంలోకి తీసుకొనే, చిత్రం వుంటుందన్నారు.