హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు, ‘బలగం’ మొగిలయ్యను తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులను కోరారు. మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో నిత్య పర్యవేక్షణలో మొగిలయ్యకు వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని, డయాలసిస్ కొనసాగిస్తూ చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.