సంచలన కామెంట్స్ కు రెడీగా వుండే దర్శకుడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం ఆయన తీసిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. ఎప్పుడు ఏ సినిమా తీసి, ప్రేక్షకుల నోళ్లలో నానుతారో ఎవ్వరికీ తెలియడం లేదు. ప్రస్తుతం డేంజరస్, కొండా సినిమా రిలీజ్ కు సమాయత్తమయ్యాయి. వీటన్నింటితో పాటు బాలీవుడ్ లో ఓ భారీ సినిమా చేస్తానని వర్మ స్వయంగా ప్రకటించి, సంచలనానికి తెర లేపారు.
అయితే ఈ భారీ చిత్రం బిగ్ బీ అమితాబ్ తోనే తీయనున్నారని తెలుస్తోంది. ఎందుకుంటే వర్మకు, బిగ్ బీ మధ్య ఎంతో అనుబంధం వుంది. అమితాబ్ తో వర్మ తీసిన సర్కార్ చిత్రం పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు సినిమాలు చేస్తే.. అందులో రెండు మాత్రమే హిట్ కొట్టాయి. ఇప్పుడు తాజాగా వర్మ అమితాబ్ తో మరో చిత్రం చేయబోతున్నారు. అయితే ఈ సినిమా హారర్ గా వుంటుందని వర్మ ప్రకటించారు. ఈ నవంబర్ లోనే అమితాబ్ వర్మకి డేట్స్ ఇచ్చారు. నవంబర్ లోనే సినిమాను ప్రారంభించి, అతి తక్కువ సమయంలోనే వర్మ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారట.