జూన్ మాసంలోనే గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 9,200 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంటుందన్నారు. అందరూ.. అన్ని పోస్టులకు పరీక్షలు రాసేందుకే ఒకదాని తర్వాత ఒకటిగా నోటిఫికేషన్లు ఇస్తున్నామని మంత్రి వివరించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ యేడాదిలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ పోరాడి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారని గుర్తు చేశారు. పోలీసు ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత తమ సర్కార్ దేనని హరీశ్ అన్నారు.