భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలను మంజూరు చేశారు. ప్రత్యేక నిధుల నుంచి సీఎం కేసీఆర్ వీటిని కేటాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ఈ నెల 30న జరగనుందని, సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులను వెచ్చించారని తెలిపారు. కరోనా సమయంలో భద్రాద్రి ఆలయానికి భక్తుల రాక తగ్గిందని, దాంతో ఆదాయం లేకపోవడంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేవాదాయశాఖ తరఫున సీఎం కేసీఆర్ కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఇప్పటికే భద్రాచలంలో తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నిత్యం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ నెల 30 కల్యాణం సీతారాముల కల్యాణం జరునుండగా.. 31న 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం క్రతువు జరగనున్నది.