సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ ఎంపికయ్యారు. ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. దీంతో ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ యూయూ లలిత్ పేరును సిఫార్సు చేశారు. జస్టిస్ యూయూ లలిత్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో చాలా సీనియర్. ట్రిపుల్ తలాక్ తో పాటు చాలా తీర్పుల్లో ఆయన భాగస్వామ్యం వుంది. మరో వైపు ఈ నెల 26 న జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. 49 వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే.. సుప్రీం బెంచ్ కు వచ్చి, అత్యున్నత స్థానాన్ని అందుకున్న రెండో వ్యక్తిగా జస్టిస్ లలిత రికార్డుల్లోకెక్కారు.
కాగా, జస్టిస్ యు యు లలిత్ మహారాష్ట్రలో 1957 నవంబర్ 9న జన్మించారు. 1983లో న్యాయవాదిగా లలిత్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1986లో ముంబైæ నుంచి ఢిల్లీకి వచ్చారు. 2004, ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ అయ్యారు. క్రిమినల్ లాయర్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్, తులసీరామ్ ప్రజాపతి కేసు, బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్ కేసుల్ని వాదించారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అవినీతి కేసుల్ని, 2జీ స్ప్రెక్టమ్ కేసుల్లో సీబీఐ తరపున కూడా వాదించారు.