మంచు కుటుంబంలో విభేదాలున్నాయన్నది కొన్ని రోజులుగా జరుగుతున్న టాక్. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఏమాత్రం పొసగడం లేదన్నది వినిపిస్తున్న మాట. అయితే… ఇవి ఎంత మేరకు నిజమో, కాదో , తెలియలేదు. కానీ… తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు నిజమేనని తేలిపోయింది. తన ఇంట్లోకి విష్ణు చొరబడి… తన అనుచరులపై దాడి చేశాడని తాజాగా మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
విష్ణు ఇంట్లోకి చొరబడి, మనోజ్ సన్నిహితుడు అయిన సారథితో వివాదానికి దిగాడు. అంతేకాకుండా చితకబదాడు. దీంతో సారథికి తీవ్ర గాయాలయ్యాయి. ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండి.. ఇదీ ఇక్కడి పరిస్థితి అంటూ మనోజ్ చెప్పాడు. దాడి విషయం తెలుసుకున్న మనోజ్, లక్ష్మి.. వెంటనే సారథి ఇంటికి వెళ్లారు. అప్పుడు జరిగిన వివాదమే మనోజ్ సోషల్ మీడియాలో స్టోరీగా పోస్ట్ చేశాడు. తనను ఏం చేయలేకనే సారథిపై దాడి చేశాడని మనోజ్ ఆరోపించాడు.
అయితే… ఈ విషయం పెద్దది కావడంతో మోహన్ బాబు ఎంటరయ్యారు. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు.. ఫోన్ కాల్ ద్వారా మంచు విష్ణు, మనోజ్ లను మందలించారు. అన్నదమ్ములిద్దరికీ నచ్చచెప్పడంతో ఈ వివాదాన్ని సద్దుమనిగింది. అయితే, ఫోన్ లో మోహన్ బాబు.. అన్నదమ్ములిద్దరిపై సీరియస్ అయ్యారు. చివరికి ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు.