టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ వివాహబంధంలోకి అడుగు పెట్టి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేశ్ తన భార్య నమ్రతా శిరోద్కర్ కు ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ లో పెళ్లి రోజులు శుభాకాంక్షలు చెప్పారు. తమ బంధం జీవితాంతం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరారు. ఇన్ స్టాగ్రమ్ లో నమ్రతతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన మహేశ్ తమ వివాహబంధంపై స్పెషల్ పోస్ట్ చేశారు. నమ్రత సోషల్ మీడియాలో ‘మేము తీసుకున్న అత్యుత్తమ నిర్ణయానికి 18ఏళ్లు పూర్తయ్యాయి. మహేష్ బాబుకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మహేష్‌తో కలిసి ఉన్న పాత ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక మహేష్ బాబు ‘మా ప్రయాణానికి 18 సంవత్సరాలు. మనం ఎప్పటికి ఇలాగే కొనసాగాలి. వార్షికోత్సవ శుభాకాంక్షలు నమ్రత శిరోద్కర్’ అంటూ నమ్రతతో కలిసి ఉన్న పోస్ట్‌ను షేర్ చూశాడు. ఈ జంటకు పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ పెళ్లి రోజును విదేశాల్లో సెలబ్రెట్ చేసుకుంటున్నారు.
18 years together and forever to go! Happy anniversary NSG ♥️♥️♥️ pic.twitter.com/E1uHd2k7q5
— Mahesh Babu (@urstrulyMahesh) February 10, 2023