ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోమారు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీకి పయనం కానున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నారు. అయితే ఈ నెల 17న ప్రధానితో ఏపీ సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు వారాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరెవరని కలవబోతున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది.
