ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ కి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఖలిస్తానీ వాదం పేరిట… దేశ వ్యతిరేక అజెండాను మోయడమే కాకుండా… చాలా మంది మహిళలతో సంబంధాలు కూడా కలిగివున్నాడు. దీనికి సంబంధించిన మహిళలతో ఛాలింగ్ లు, వాయిస్ నోట్ లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చాయి. మొత్తం 12 వాయిస్ నోట్ లు ఇప్పుడు బయటపడ్డాయి. టైం పాస్ కోసమే చాలా మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నట్లు అమృత్‌పాల్ సింగ్ చెబుతున్న మాటలు అందులో స్పష్టంగా వినిపిస్తున్నాయి.
అయితే… విషాదం ఏమిటంటే… ఆ మహిళల్లో చాలా మంది వివాహితలు కూడా వున్నారు. ఎటువంటి ఒప్పందాలు లేకుండా పెళ్లి చేసుకోవడం.. వీడియో కాల్స్‌లో మహిళలకు అమృత్‌పాల్ కిస్సులు ఇస్తున్నట్లు ఉన్న కొన్ని మెసేజ్‌లు బయటకు వచ్చాయి. ఒంటరిగా ఉన్న మహిళలు, వివాహితల(married women)ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆ మహిళలను వశపరుచుకున్నట్లు ఓ ఆంగ్ల సైట్ తన కథనంలో రాసింది.