పెండింగ్ లో వున్న బిల్లుల విషయంలో తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో వున్న 3 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 2 బిల్లులను రాష్ట్రపతికి పంపారు. మరో 2 బిల్లులను తిప్పి పంపగా, మరో 2 బిల్లులను మాత్రం పెండింగ్ లో పెట్టేశారు. పెండింగ్ లో వున్న బిల్లుల విషయంలో నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రబుత్వం పక్షాన సీఎస్ సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని చేర్చారు. 200వ ఆర్టిక్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. నేడు గవర్నర్ మొత్తం 10 బిల్లులకు మూడింటిని మాత్రమే ఆమోద ముద్ర వేశారు.
కొన్ని రోజులుగా పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిని తేల్చుకునేందుకే ప్రభుత్వం సుప్రీం మెట్లెక్కింది. విషయ తీవ్రత, ప్రాధాన్యత నేపథ్యంలోనే తాము సుప్రీం మెట్లెక్కినట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.