ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. 2 గంటల పాటు మోదీ హైదరాబాద్ లోనే వుండనున్నారు. శనివారం ఉదయం 11:30 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు మోడీ. అక్కడి నుండి 11:45 కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొని..11:45 – 12 గంటల వ్యవధిలో వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తారు. 12:05 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పెరేడ్ గ్రౌండ్ కు వెళ్తారు మోడీ. 12:15 నిమిషాలకు కు పెరేడ్ గ్రౌండ్ కు చేరుకొని.. 1: 20 నిమిషాల వరకు పెరేడ్ గ్రౌండ్లో లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుండి 1:35 నిమిషాలకు బేగంపేట్ విమానాశ్రయం కు చేరుకొని విమానంలో చెన్నై వెళ్లనున్నారు.
బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్ రానుండటం, బహిరంగ సభలో పాల్గోనుండటంతో.. ప్రధాని ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అయితే, కేసీఆర్ ప్రధాని మోదీ టూర్‌లో పాల్గొంటారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు.