రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం 14 మందితో కూడిన ఓ ప్యానెల్ ను ప్రకటించింది. ఈ ప్యానెల్ కు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్ గా వుండనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అశ్వనీ వైష్ణవ్, సర్బానంద సోనోవాలా, అర్జున్ మేఘవాల్, భారతీ పవార్, తరుణ్ ఛుగ్, డీకే అరుణ, రితురాజ్ సిన్హా, శ్రీనివాసన్, సంబిత్ పాత్రా సభ్యులుగా వుంటారు. ఇక పార్టీ నుంచి కూడా ఈ ప్యానెల్ లో సభ్యులుగా వున్నారు. ఇక… కో కన్వీనర్లుగా వినోద్ తావడే, సీటీ రవి ఉండనున్నారు.
ఇప్పటి వరకైతే బీజేపీ తన రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. అయినా.. అభ్యర్థి ప్రకటన వెలువడగానే.. అన్ని పక్షాలు ఒప్పుకునేందుకు.. వాళ్లు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయం కోసం ముమ్మర ప్రయత్నాలను ప్రారంభించేసింది. రక్షణ మంత్రి, బీజేపీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో సంప్రదింపులు జరిపారు. ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు. ఇవి జరుగుతుండగానే బీజేపీ ప్యానల్ ను ప్రకటించింది.