ఢీ, రెడీ, సై, వంటి… బ్లాక్ బస్టర్ మూవీలతో తెలుగులో కొన్ని సంవత్సరాల పాటు జెనీలియా కొనసాగింది. బొమ్మరిల్లు సినిమాలో తన అమాయకపు యాక్షన్ తో తెగ పాపులర్ అయ్యింది. అయితే.. రానాతో నా ఇష్టం సినిమా తర్వాత జెనీలియా తెలుగు ఇండస్ట్రీలో ఇక కనిపించలేదు. రితేష్ దేశ్ ముఖ్ తో వివాహమైన తర్వాత… పూర్తిగా ఇంటికే పరిమితమైంది. కానీ… భర్త రితేష్ తో కలిసి వేద్ సినిమాలో మళ్లీ తళుక్కుమంది. మంచి పేరు కూడా సంపాదించుకుంది.
అయితే.. రెండు పడవల మీద ప్రయాణించడం సాధ్యం కాదని, అందుకే పెళ్లి తర్వాత… ఇండస్ట్రీ వైపు చూడటం లేదని చెప్పింది. పెళ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితం అయ్యానని, అలా చేయడం వల్లే మంచి ఇల్లాలిగా పేరు సంపాదించుకున్నానని తెలిపింది. సినిమాలు చేస్తూ.. ఇంటిని చూసుకోవడం కుదిరే పనికాదని తెలిపింది. పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితం అయిపోవడంతో ప్రొడ్యూసర్‌గా సొంత ప్రొడక్షన్ చేస్తున్నా. మరికొన్ని వ్యాపార సంస్థలూ స్థాపించగలిగానని తెలిపింది జెనీలియా.