విఘ్నేశ్ శివన్… నయన్ తార.. ఇప్పుడు ఇది సెలబ్రెటీ జంట. నయనతార 7 సంవత్సరాల తర్వాత కొన్ని రోజుల క్రితమే విఘ్నేశ్ శివన్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. 37 ఏళ్ల వయస్సులో నయనతార పెళ్లి చేసుకుంది. జూన్ 9 న హిందూ సంప్రదాయంలోనే నయన్, విఘ్నేశ్ ల వివాహం జరిగింది. అయితే ఈ విఘ్నేశ్ నయనతార ప్రేమికుడిగానే చాలా మందికి తెలుసు. ఇదొక్కటే కాదు.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే వున్నాయి. మొదగా విఘ్నేశ్ శివన్ నయన తారకు మంచి ఫ్యాన్ అట. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నయన తార యాక్టింగ్ ను విఘ్నేశ్ చాలా ఇష్టపడేవాడట.
ఇక… రెండో ముచ్చట.. పాటల రచయితగా విఘ్నేశ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తమిళ్ లో 60 పాటలను రాశాడు. అనిరుద్ధ్ సంగీతం అందించిన సినిమాలకే విఘ్నేశ్ ఎక్కువ సంఖ్యలో పాటలు రాశాడు. అన్నట్లు అనిరుద్ధ్, విఘ్నేశ్ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి మధ్యా స్నేహం చాలా రోజులుగా నడుస్తోంది. ఈ కారణంగానే విఘ్నేశ్ ఎక్కువగా పాటలు రాసిచ్చాడు.

మరో విషయం కూడా విఘ్నేశ్ లో వుంది. ఈయన మంచి సంగీత దర్శకుడు కూడా. కెరీర్ ప్రారంభం ప్రారంభంలోనే చాలా మ్యూజిక్ ఆల్బమ్స్ చేశాడు.ఇక నిర్మాతగా రౌడీ పిక్చర్స్ అనే సంస్థ ప్రారంభించి, నేత్రికన్, కుజంగల్ అన్న చిత్రాలను నిర్మించి, ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఇవన్నీ జరుగుతుండగానే డిస్ట్రిబ్యూటర్ గా పనిచేస్తూ రాకీ అనే యాక్షన్ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడు.
పోడా పోడి, నానుమ్ రౌడీ దాన్, తానా సెర్న్ద్ కోట్టం, పావ కాదయిగల్, కాతు వాకుల రెండు కాదల్ వంటి చిత్రాలను తెరకెక్కించి, ఈ సినిమాలకు రైటర్ గా వున్నాడు. ఇక… రాజా రాణి చిత్రం నుంచి విఘ్నేశ్ నయనతారపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. నయన తార సక్సెస్ లో విఘ్నేశ్ పాత్ర కీలకం. నయన తార ఓ సినిమాకు టిక్ కొట్టాలంటే విఘ్నేశ్ టిక్ కొట్టాల్సిందే. లేదంటే ఒప్పుకోదట. నయన తార బిజినెస్ వ్యవహారాలన్నీ విఘ్నేశే చూసుకుంటున్నట్లు సన్నిహితులు అంటున్నారు.