పొంతన లేని పోలిక చేసి ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సాయి పల్లవిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి మొదటి సారిగా స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యలపై కచ్చితంగా సమాధానం ఇస్తానని, అయితే ఇది సమయం కాదని పేర్కొంది.
ఇప్పుడు మాట్లాడితే తన సినిమా ప్రమోషన్ కోసమే వివరణలు ఇస్తున్నట్లు అనుకుంటారని అంది. ప్రస్తుతం తాను విరాటపర్వం విడుదల జోష్ లో వున్నానని, సినిమా విడుదలైన తర్వాత వివరంగా మాట్లాడతానని సాయి పల్లవి పేర్కొంది. అయితే.. ఈ వివాదం నుంచి తనను సేవ్ చేయడానికి తన అభిమానులు ఎంతో శ్రమిస్తున్నారని, ఈ విషయం తనకు తెలుసని పేర్కొంది. విరాట పర్వం రిలీజ్ కాగానే మొత్తం మాట్లాడతానని సాయి పల్లవి తెలిపింది.