Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వివేకా హత్య కేసు : దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై సుప్రీం అభ్యంతరాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నేడు సుప్రీంలో జరిగింది. ఈ హత్య కేసుకి సంబంధించిన దర్యాప్తు అధికారి మార్పుపై ప్రతిపాదనలను సీబీఐ అధికారులు సుప్రీంకి అందజేశారు. అయితే.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న రామ్ సింగ్ ను కొనసాగిస్తూ సీబీఐ ప్రతిపాదనలు పెట్టగా… జస్టిస్ ఎంఆర్ షా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతే లేనప్పుడు ఆయన్ను కొనసాగించడంలో అర్థం లేదని కుండబద్దలు కొట్టారు.

 

న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం చెప్పడంతో సీబీఐ… రాంసింగ్ తో పాటు మరో పేరును కూడా సూచించింది. మరోవైపు ఏప్రిల్ 15 కల్లా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ అధికారులు సుప్రీంకి నివేదించారు. ఇక… విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 గా వున్న శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామన్న సుప్రీం… ఈ కేసులో మధ్యాహ్నం కల్లా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది.

 

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసును విచారిస్తారని సీబీఐని సూటిగా ప్రశ్నించింది. ఈ హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలను బయటకు వెల్లడించాలని సూచించింది. దర్యాప్తు వేగంగా సాగటం లేదని.. దర్యాప్తు అధికారులు మార్చాలని కోరుతూ వివేకా హత్య కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం.. వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది.

 

స్టేటస్ రిపోర్టులో ఏమాత్రం పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశాలిచ్చింది. కుట్ర గురించి మాత్రం లోతైనా దర్యాప్తు చేసినట్లు ఎక్కడా కనిపించలేదని, ఎంత సేపూ రాజకీయ వైరం అని మాత్రమే రాశారంటూ మండిపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. అయితే రామ్ సింగ్‌ను మాత్రం కొనసాగించాలని తెలిపింది.

Related Posts

Latest News Updates