ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠా్త్మకంగా నిర్వహిస్తోన్న జీ-20 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. బుధవారం రెండో రోజూ జీ-20 మీట్‌లో భాగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ అంశంపై ప్రతినిధులు చర్చించనున్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రత్యేకతలపై ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సాగర తీరంలో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై సంబంధిత నిపుణులతో అవగాహన కార్యక్రమాలుంటాయి. అంతకుముందు మంగళవారం రాత్రి జీ-20 సదస్సుకు వచ్చిన అతిథులకు ఘనంగా విందు ఏర్పాటుచేశారు.
సీఎం జగన్ అధ్యక్షతన ఈ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. విశాఖలో గడిపే ప్రతి సమయం, ప్రతి క్షణం చెరిగిపోని జ్ఞాపకంలా మిగిలిపోతుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చామన్నారు. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా విశేషంగా చర్యలు తీసుకుంటున్నామని, సరైన చర్చలు జరిపి, సస్టెయిన్ బుల్ పద్ధతులను సూచించాలని కోరారు. దీనిపై సరైన మార్గదర్శకత్వం కూడా అవసరమని సీఎం జగన్ జీ 20 ప్రతినిధులను కోరారు.
విశాఖపట్నం మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు సిద్ధమైపోయింది. విశాఖ వేదికగా వరుసగా 4 రోజుల పాటు జీ 29 సమ్మిట్ జరగనుంది. ఏపీ ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. విశాఖ సిటీని సుందరంగా తీర్చిదిద్దారు. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్ తో 28,29, 3,32 తేదీల్లో జరగనుంది. రాడిసన్ బ్లూ హోటల్ లో 4 రోజుల పాటు జరిగే సదస్సుకు జీ 20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
జీ 20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,500 మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే తదితర దేశాల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు.
తొలిరోజు సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే జీ 20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. వీరికి అవసరమైన రవాణా వసతి, భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్ తో అతిథులను ఆహ్వానించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ స్తంభాలను, పుట్ పాత్ లను, రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీ 20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విశాఖలోని వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకూ వైజాగ్ కార్నివాల్, ఆర్కే బీచ్ నుంచి 3కే,5కే 10 మారథాన్ నిర్వహించారు.