వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఫ్యాక్టరీ నిర్వహణ కోసం మూలధనం, ముడిసరుకుల కోసం నిధులు ఇచ్చి, ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల బిడ్డింగులో సింగరేణి లేదంటే… రాష్ట్ర ఖనిజ అభివ్రుద్ధి సంస్థ పాల్గొనే అవకాశాలున్నాయి. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ప్రతిపాదనల కోసం విశాఖకు వెళ్లి అధ్యయనం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ ఆదేశాలతో మరో రెండు రోజుల్లో తెలంగాణ అధికారులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వెళ్లనుంది. తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చోకావలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో, బిడ్డింగ్ నిర్ణయంలో రాష్ట్ర సర్కారు నిర్ణయమే ఫైనలా క లేక కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు ఏమైనా ఉంటాయా అనేది చూడాల్సి ఉంది.
ఈ నెల 15 వరకు బిడ్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో ఆలోగా పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ వేరే రాష్ట్రంలో బిడ్ దాఖలు చేయలేదు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేస్తే ఇది చారిత్రాత్మక నిర్ణయంగా దేశ చరిత్రలో నిలిచిపోనుందని చెప్పవచ్చు.