Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వైభవంగా ప్రారంభమైన ఆటా మహా సభలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 17వ మహాసభలు శుక్రవారం సాయంత్రం బాంక్వెట్‌ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బూజాల మాట్లాడుతూ, కోవిడ్‌ తరువాత కమ్యూనిటీని ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు నిర్వహించిన ఈ వేడుకలకు అమెరికా నలుమూలల నుంచే కాక, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది కుటుంబ సభ్యులతో సహా హాజరుకావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమ టీమ్‌, కాన్ఫరెన్స్‌ టీమ్‌ ఎంతో ప్రణాళికతో కొన్ని నెలల ముందు నుంచే కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారని, వారి సహకారాన్ని కృషిని మరువలేనన్నారు.

ఈ వేడుకలకు దాదాపు 5,000 మందికిపైగా హాజరవడం విశేషం. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడా దిగ్గజ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, క్రాంతి కిరణ్‌, గ్యాదరి కిషోర్‌ తదితరులు వచ్చారు.

వీరితో పాటు సద్గురు జగ్గీ వాసుదేవ్‌, మాజీ క్రికెటర్లు గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, క్రిస్‌గేల్‌, హీరో అడవి శేష్‌, నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ అండ్‌ టీం.. గాయకులు శ్రీకృష్ణ, సునీత, మనీషా ఈరబత్తిని, మంగ్లీ.. గీత రచయితలు చంద్రబోస్‌, రామజోగయ్య శాస్త్రి, శేఖర్‌ మాస్టర్‌, పద్మశ్రీ పద్మజ, కూచిపూడి కళాకారుల బృందం, తనికెళ్ల భరణి, ఉపాసన కొణిదెల, యాంకర్లు శ్రీముఖి, రవి, ఇల్యూషనిస్ట్‌ బి ఎస్‌ రెడ్డి, మిమిక్రీ ఆర్టిస్ట్‌ రమేష్‌, మిమిక్రీ ఆర్టిస్‌ శివా రెడ్డి, కూచిపూడి గురువు డా. హలీం ఖాన్‌ తదితరులు కూడా ఈ వేడుకలకు తరలివచ్చారు. మంగ్లీ పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి. శోభారాజు కచేరి మనోల్లాసాన్ని కలిగించింది.

Related Posts

Latest News Updates