ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. మంగళవారం ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
చిత్ర నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘సమంతగారు ఈ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి రావాల్సింది. కానీ రాలేకపోయారు. అయితే ఆమె మనసంతా ఇక్కడే ఉంది. శాకుంతలం సినిమాను 3D టెక్నాలజీలోకి మార్చాలనే ఆలోచన దిల్‌రాజుగారిదే. అందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్. ఇప్పుడు త్రీడీ ట్రైలర్ చూస్తుంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన మైథాలజీని ఇలా త్రీడీలో సినిమా చేయటం ఇదే తొలిసారి అనుకుంటానని తెలిపారు.