రెండు సంవత్సరాలకు ఓసారి జరిగే తెలుగు సంఘం నాట్స్ సంబరాలు ఈసారి న్యూజెర్సీ వేదికగా జరగనున్నాయి. ఇందుకోసం తొలి సన్నాహక సమావేశం జరిగింది. సంబరాలు ఎలా చేసుకోవాలి? ఏయే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి? అతిథులను పిలవడం… లాంటి అంశాలను ఈ సన్నాహక సమావేశంలో చర్చించుకున్నారు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానితో పాటు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ బోర్డు డైరెక్టర్‌లు చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల, నేషనల్ కోఆర్డినేటర్ సురేశ్ బొల్లు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ గురు దేసు, న్యూజెర్సీ టీమ్ సభ్యులు వంశీ కొప్పురావూరి, అరుణ్ శ్రీరామ్, బసవ శేఖర్, పున్నా సూర్యదేవర, శరత్ వేట తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.స్థానిక కళాకారులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నాట్స్ నినాదమైన భాషే రమ్యం సేవే గమ్యం కు తగ్గట్టుగా ఈ 7 వ సంబరాలను ప్రత్యేకంగా రూపు దిద్దటానికి నడుము బిగించి తనతో కలిసి అందరూ ఒకే త్రాటిపై నడిచి అంబరాన్ని అంటేలా చేసి చూపిద్దామని శ్రీధర్ అప్పసాని పిలుపునిచ్చారు.