ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మరో వ్యక్తి రోహిత్ గార్గ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరుతో బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చింది. హిందీలో ఇది రాసి ఉంది. బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిఫ్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్లపై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 506(2), 120 (బీ) 34 సెక్షన్ ల కింద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్కు ముప్పు ఉందని గుర్తించిన ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు.
