హీరోయిన్ సాయి పల్లవికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సుల్తాన్ బజార్ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాలోని ఘటనలను, ఆవులను తరలిస్తున్న సమయంలో డ్రైవర్ ను చంపిన ఘటనతో పోలుస్తూ ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
దీంతో భజరంగ్ దళ్, వీహెచ్ పీ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుల్తాన్ బజార్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయగా… వాటిని సవాల్ చేస్తూ సాయి పల్లవి హైకోర్టుకెక్కింది. ఈ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆమె విచారణకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. దీంతో సాయి పల్లవి చిక్కుల్లో పడినట్లైంది.