రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సోదరుడు అగ్రసేన్ గెహ్లోత్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. జోధ్ పూర్ లోని ఆయన ఇంటితో పాటు ఆయన కార్యాలయాల్లో కూడా ఈ తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఫెర్టిలైజర్ల ఎగుమతుల్లో అవకతవకలు చేశారన్న ఆరోపణలు ఆయనపై వున్నాయి.
ఈ ఆరోపణలపై గతంలోనే ఈడీ దర్యాప్తు చేపట్టింది. అగ్రసేన్ ఎరువుల వ్యాపారం చేస్తున్నారు. 2007-09 లో భారీ ఎత్తున ఎరువుల అక్రమ ఎగుమతికి పాల్పడ్డారని ఈడీ గతంలో పేర్కొంది. దేశ రైతులకు సబ్సిడీ కింద అందిచాల్సిన మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ను అక్రమంగా విదేశాలకు తరలించారని ఈడీ పేర్కొంది.
సీఎం గెహ్లోత్ సోదరుడి ఇంట్లో సీబీఐ దాడులు చేయడంపై కాంగ్రెస్ స్పందించింది. ఇది కక్షపూరిత చర్య అని, రాజకీయ చర్యగా కాంగ్రెస్ అభివర్ణించింది. విద్వేశపూరిత రాజకీయ దాడి అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఇంత దాడులు చేసినా.. తాము మౌనంగా ఉండమని జైరాం అన్నారు.