నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఫిలింనగర్ భూ వివాదం కొత్త మలుపు తిరిగింది. కొన్ని రోజులుగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికీ, సురేష్ బాబు- రానాకి మధ్య భూ వివాదం నడుస్తోంది. తాజాగా… ప్రమోద: కుమార్ సురేష్ బాబు తమను రౌడీల సాయంతో దౌర్జన్యంగా స్థలం ఖాళీ చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాళీ చేయకపోతే.. అంతు చూస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ప్రమోద్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, రానాతో పాటు మరికొంత మందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు నోటీసులు పంపించింది.
