తన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ఏవీని చూసి… హీరో, ఆయన సోదరుడు శివరాజ్ కుమార్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. పునీత్ ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నాడు. శివరాజ్ నటించిన వేద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కి వచ్చాడు. ఈ ఈవెంట్ ఓ ప్రముఖ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా అక్కడి వారు పునీత్ రాజ్ కుమార్ ఏవీని చూపించారు. అందులో పునీత్ నటించిన చిత్రాలను చూపించారు. దాన్ని చూస్తూ… శివకుమార్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ…. వెక్కి వెక్కి ఏడ్చేశాడు.
దీంతో పక్కనే వున్న నందమూరి బాలకృష్ణ అతడ్ని ఓదార్చారు. ఆ తరువాత అదే ఫంక్షన్ లో శివ కుమార్ మాట్లాడుతూ… అలా భావోద్వేగానికి గురిఅయినందుకు సారీ చెప్పాడు. ఏడ్వకూడదని అనుకుంటాను గానీ పునీత్ ఫొటో చూడగానే కంట్రోల్ చేసుకోలేకపోయానని అన్నాడు.. తనకు 13 ఏళ్లు ఉన్నపుడు పునీత్ పుట్టాడని, తను ఎప్పుడూ నాకు ఒక పిల్లాడు లాంటివాడని అన్నాడు. కానీ తాను తన కళ్ల ముందే వెళ్లిపోయాడని భావోద్వేగానికి గురయ్యాడు.