కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హెల్త్ బులిటెన్ ను కాంగ్రెస్ విడుదల చేసింది. కరోనా తదనంతర సమస్యలతో ఆమె బాధపడుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ముక్కు నుంచి రక్తం కారడంతో జూన్ 12 న సోనియాను ఢిల్లీలోన సర్ గంగారాం ఆస్పత్రిలో చేర్పించారని పేర్కొన్నారు.
వైద్యులు వెంటనే చికిత్స చేశారని, గురువారం ఆమెకు మరోమారు పరీక్షలు జరిగాయన్నారు. శ్వాస కోశాల్లో ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారని, దీనితో పాటు కరోనా తదనంతర సమస్యలు కూడా ఉన్నట్లు జైరాం తన ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఆస్పత్రిలోనే ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని కాంగ్రెస్ పేర్కొంది.
A statement on Congress President’s health condition. pic.twitter.com/4tVBtgyhEi
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 17, 2022