జవహర్‌నగర్/హైదరాబాద్, జూన్ 13 రాష్ట్రంలోని ఖమ్మం, మంథని, రామాయంపేట, నిర్మల్, కోదాడ, వనస్థలిపురం, జూబ్ల్లీహిల్స్‌లలో జరిగిన హత్యలు, అత్యాచారాల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం నాయకుల హస్తం ఉందని.. హత్యలు, అత్యాచారాలకు ఆ పార్టీలు కేరా్‌ఫగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రధాని మోదీ 8 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. గడిచిన 8 ఏళ్లలో ప్రధాని మోదీ పాలన, తెలంగాణలో కొనసాగుతున్న పాలనపై చర్చకు సిద్ధమా..? అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్‌లో బాలికపై అత్యాచారం పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. బీజేపీ ఆందోళన చేస్తేనే నిందితులపై కేసు నమోదు చేశారని చెప్పారు. వారికి స్టార్ హోటల్ నుంచి బిర్యానీ పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలోనూ గాంధీ ఆస్పత్రిలో పేదలకు సరైన తిండి పెట్టలేదని.. మరో ఆస్పత్రిలో బాదం, పిస్తాలు అందించారని ప్రభుత్వ తీరును తప్పబట్టారు.
