తిరుమల ఆగస్టు 7 నుంచి కల్యాణమస్తు జరగనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. జూలై 1 నుంచి జిల్లా కేంద్రాల్లో వివాహాలకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో మాత్రమే కల్యాణ మస్తు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మరికొన్ని రోజుల తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తామని ఈవో ప్రకటించారు. ఉదయం 8.07 నుంచి 8.15 గంటల మధ్య ముహూర్తాలుంటాయని ధర్మారెడ్డి పేర్కొన్నారు.