Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘శివాజీ’ వచ్చి సరిగ్గా 15 సంవత్సరాలు..

సూపర్ స్టార్ రజనీకాంత్, శ్రియా నటించిన శివాజీ సినిమాకి సరిగ్గా 15 ఏళ్లు నిండాయి. నల్లధనం నేపథ్యంగా, అత్యంత సందేశాత్మకమైన కథాంశంతో వచ్చి.. ఈ సినిమా అందర్నీ మెప్పించింది. శివాజీగా తలైవా నటించి, అందర్నీ మెప్పించారు. ఈ సినిమాకు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సినిమా దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సమావేశమయ్యాడు.

ఈ ఫొటోలను దర్శకుడు శంకర్ షేర్ చేశాడు. మా శివాజీ బాస్ ను కలుసుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది. శివాజీకి 15 వసంతాలు. ఇది చిరస్మరణీయమైన రోజు. అంటూ శంకర్ పేర్కొన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 800 ప్రింట్లతో విడుదలైంది. తమిళనాడులో 300 థియేటర్లు, తెలుగు నాట 350 థియేటర్లలో విడుదలైంది.

Related Posts

Latest News Updates