నటుడు విశాల్ కు మళ్లీ గాయాలయ్యాయి. మార్క్ ఆంటోనీ చిత్రీకరణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఫైట్ సీన్ తీస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో మార్క్ ఆంటోనీ షూటింగ్ ను నిలిపేశారు. కొన్ని రోజుల పాటు విశాల్ విశ్రాంతి తీసుకుంటారని చిత్ర యూనిట్ పేర్కొంది. గతంలోనూ విశాల్ షూటింగ్ సమయంలో గాయాల పాలయ్యాడు. లాఠీ షూటింగ్ లో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అయితే.. ఫైట్ సీన్స్ ను తీయడంలో విశాల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. పోరాట సన్నివేశాల కోసం డూప్ లేకుండా చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటాడు. ఫైట్ సీన్స్ ను కూడా చాలా సహజంగా చేస్తుంటాడు. ఈ క్రమంలో నే విశాల్ కు గాయాలవుతాయని సినిమా క్రిటిక్స్ పేర్కొంటున్నారు.