Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

1-03-2023 దశ దిశ

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థికంగా అనుకూల సమయం ఇది. అధికార యోగానికి అవకాశం ఉంది. ముఖ్యమైన
పనులను వాయిదా వేయకపోవడం మంచిది. ఉద్యోగ పరంగా కొన్ని ఆటంకాలను
అధిగమిస్తారు. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. ఆశించినంతగా ఆదాయం పెరిగే
సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అదనంగా ఆదాయం గడించే అవకాశం ఉంది.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమ ఫలిస్తుంది. అనుకున్న ఆశయం నెరవేరుతుంది.
వ్యాపార పరంగా లాభపడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చాలాకాలంగా
వేధిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఓ శుభవార్త
ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు, తీసుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. సరైన ఆలోచనలు. నిర్ణయాలతో ఆదాయం
పెంచుకుంటారు. ఇంట్లో శుభకార్యానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలకు
సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. గృహ ప్రయత్నాలు ఒక
కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా
ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు
పూర్తవుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం నిలకడగా
ఉంటుంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. బంధు
వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
మీ ప్రతిభా పాటవాలకు తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చదువుల్లో చక్కని
విజయాలు సాధిస్తారు. పట్టుదలగా పనులు పూర్తి చేస్తారు. రాదనుకున్న డబ్బు
చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా
అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు చేసే అవకాశం ఉంది. మంచి పరిచయాలు
ఏర్పడతాయి. ఆరోగ్యం పర్వాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ముఖ్యమైన పనుల్లో శ్రద్ధను పెంచడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో తగినంత
దృఢ సంకల్పం అవసరం. గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల
ఆర్థికంగా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరిగినప్పటికీ
సత్ఫలితాలను ఇస్తాయి. రుణ సమస్య తగ్గడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం
నిలకడగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగ పరంగాను, కుటుంబ పరంగాను కొన్ని చిక్కులు తలెత్తుతాయి. ఉద్యోగం
మారడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు
తీసుకోవాల్సి ఉంటుంది. ఒక శుభవార్త మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆదాయం
నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. సమాజంలో
పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరించుకునే
ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. సహచరులు
ఇబ్బందులు కలిగిస్తారు. సమయానుకూలమైన నిర్ణయాలతో కుటుంబ సమస్యల్ని
పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. మిత్రుల సలహాలను పాటించండి. తగాదాలకు
వీలైనంత దూరంగా ఉండండి. ఆదాయం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం బాగానే
ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఆర్థిస్తారు. ఉద్యోగంలో అధికారులతో
సమస్యలు పరిష్కారం అవుతాయి. అందరిని కలుపుకుని పోయేందుకు ప్రయత్నం
చేయండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. కొందరు
బంధువులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా మెరుగుదల కనిపిస్తోంది. మీ నిర్ణయాలు,
ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త
సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. రావనుకున్న బాకీలు వసూలు అవుతాయి. ఆదాయంలో
ఆశించినంత పెరుగుదల కనిపిస్తోంది. కొద్దిగా ఆలస్యమైనా ముఖ్యమైన పనులు
పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. మితిమీరిన ఔదార్యం వల్ల నష్టపోతారు.
ఉద్యోగ పరంగా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కీలక విషయాల్లో బంధుమిత్రుల
సలహాలు, సూచనలు తీసుకోండి. ఆకస్మిక ధన లాభం ఉంది. శుభవార్త వింటారు.
సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో
జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగానే ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన
పనులు పూర్తి చేస్తారు. ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే కుటుంబ సమస్యలు
పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ శ్రమకు తగ్గ
ఫలితాలు అనుభవానికి వస్తాయి. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం
బాగానే ఉంటుంది.

Related Posts

Latest News Updates