అగ్నివీరులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీరులుగా రిటైర్ అయిన వారికి BSF నియామకాల్లో ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. BSF లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని, వీరు అగ్నిపథ్ మొదటి బ్యాచ్‌లో పనిచేశారా లేదా తదుపరి బ్యాచ్‌లకు చెందిన వారా అనే దాని ఆధారంగా గరిష్ట వయోపరిమితి నిబంధనలను కూడా సడలించింది. ఈ నేపథ్యంలో BSFకి సంబంధించిన నిబంధనలను సడలించింది కూడా.
అగ్నివీర్ మొదటి బ్యాచ్‌లో చేరి విశ్రాంతి తీసుకునే సైనికులకు 5 సంవత్సరాలు, తర్వాత బ్యాచ్‌లలో చేరి రిటైర్ అయిన అభ్యర్థులకు 3 సంవత్సవారల వరకూ గరిష్ట వయోపరిమితిని సడలించనున్నారు. మాజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్ నియామక ప్రక్రియలో దేహడారుఢ్య పరీక్షల నుంచి సైతం మినహాయింపు కల్పించనున్నారు. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం తొలి బ్యాచ్‌లోని అభ్యర్థులు 28 సంవత్సరాల వరకూ అగ్నివీర్‌గా సేవలందించి, ఆపై కేంద్ర భద్రతా దళాలు, అసోం రైఫిల్స్‌లో చేరేందుకు 10 శాతం రిజర్వేషన్ వెసులుబాటు కల్పిస్తుంది.