Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

10,11తేదీల్లో దేశ వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో సన్నాహాక చర్యలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా… ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రెటరీలు సమీక్షలో పాల్గొన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరగకుండా అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని హాస్పిటల్స్‌లో సన్నాహక చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ నెల8,9 తేదీల్లో జిల్లా ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులతో కోవిడ్ చర్యలపై సమీక్షించాలని ఆరోగ్య మంత్రులను కోరారు. అలాగే అతి వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలను కూడా గమనించి, పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. కోవిడ్ మొదటి దశలో ఎలాగైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయో, ఇప్పుడు కూడా అలాగే కలిసే పనిచేయాలని సూచించారు. టెస్టింగ్ మరియు జీనోమ్ సీక్వెన్సింగ్‌ను వేగవంతం చేయాలని, ఎమర్జెన్సీ హాట్‌స్పాట్‌లను గుర్తించాలని, వ్యాక్సినేషన్ ను పెంచాలన్నారు. అలాగే ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు వుండేలా చూడాలన్నారు.

 

దేశంలో కరోనా మహమ్మారి  ఉధృతమైంది. గత 203 రోజుల తర్వాత మళ్లీ ఇవాళే అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కేవలం 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 6049 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో దేశంలోని మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయి 28 వేల మార్కు దాటింది.

Related Posts

Latest News Updates