Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

12-04-2023 దశ దిశ

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సకాలంలో డబ్బు అందటం వల్ల ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం
అవుతుంది. కుటుంబ ఖర్చులు బాగా పెరగడంతో అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు
ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న
వారికి లాభాలు నిలకడగా ఉంటాయి. డాక్టర్లు,  లాయర్లకు చేతినిండా పని, జేబు
నిండా డబ్బు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు అనిపిస్తుంది.
విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో
ముందడుగు వేస్తారు.

వృషభం (కృత్తిక ౨,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అదనపు ఆర్థిక
ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.  వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక
ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఐటి
రంగంలో వారికి మంచి కంపెనీ నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారుల
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొత్త
నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి వాతావరణం సామరస్యంగా ఉంటుంది. విద్యార్థులు
కొద్ది శ్రమతో బాగా రాణిస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మీరు గతంలో తీసుకొన్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. మనసులోని
కోరిక ఒకటి నెరవేరుతుంది. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటెస్తారు.
సహచరులందరూ మీకు వీలైనంతగా సహాయం చేస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక
సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఐటీ
వారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు
సునాయాసంగా పురోగతి చెందుతారు.స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం బాగానే ఉంటుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగపరంగా
జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారుల నుంచి
ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ఆదాయ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
సోదరులతో ఆస్తి సంబంధమైన సమస్యలు ప్రారంభమవుతాయి. తల్లిదండ్రుల సహకారం
మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు
తీసుకోండి.దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు బాగా
శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. .

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి వ్యాపారాలు వారు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు.  అధికారుల
నుంచి కొద్దిగా వేధింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ,
అనవసర ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. కొందరు స్నేహితులను నమ్మి డబ్బు
నష్టపోతారు.  ఒక వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో
ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు
ప్రారంభిస్తారు. విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా
ఉంటుంది. .

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగం మారడం వల్ల ఉపయోగం ఉంటుంది.
అదనపు ఆదాయ మార్గాల కోసం ఆలోచిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో
ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
తోబుట్టువులతో మాట పట్టింపులకు అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి
చెందుతారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. కొందరు స్నేహితులు మీకు అన్ని విషయాలలోనూ
అండగా నిలబడతారు.  పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన సఫలం కాకపోవచ్చు. అదనపు
ఆదాయం కోసం ప్రయత్నం ప్రారంభించడానికి సమయం అంత అనుకూలంగా లేదు. బంధువుల
నుంచి ఒత్తిడి ఉంటుంది. మీ నుంచి సహాయం పొందిన వారు మిమ్మల్ని
తప్పించుకొని తిరుగుతారు. ఉద్యోగ జీవితం కొద్దిగా అసంతృప్తి
కలిగిస్తుంది. విద్యార్థులు శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ప్రేమలు
సంతృప్తికరంగా సాగవు.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట)
అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా
ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. స్నేహితులతో విభేదాలు తల
ఎత్తే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధంగా తీపి కబురు వినే
అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి
వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. వృత్తి నిపుణులు ఉద్యోగం
మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమించిన వారితోనే పెళ్లి కుదిరే
అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ,  వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ముఖ్యంగా వ్యాపారంలో నమ్మిన
వారు మోసగించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహచరులు మీ గురించి తప్పుడు
ప్రచారం సాగించే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది.
కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెడతారు. కొత్త
కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీరు నిర్వర్తించాల్సిన
బాధ్యతలను ఇతరులకు అప్పచెప్పవద్దు. స్నేహితులు, బంధువులు అండగా
నిలబడతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు చేపట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో
లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు.
విద్యార్థులు చదువుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబంలో ప్రశాంత
పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం
కాదు. ఐటీ రంగంవారు విదేశీ కంపెనీలో ప్రయత్నాలు సాగిస్తే మంచిది.  కొందరు
స్నేహితులను నమ్మి డబ్బు నష్టపోతారు.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలినాటి శని కారణంగా కొన్ని ఆర్థిక సమస్యలు మధ్య మధ్య అనారోగ్యాలు
తప్పకపోవచ్చు. చేపట్టిన ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. శ్రమ, తిప్పట
ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు
బాగా పెరిగిపోతాయి. ఉద్యోగంలో అదనపు ఆదాయం ఏది లేకపోయినా క్షణం తీరిక
ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. కొత్త
ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి
ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక
ప్రయత్నాలు ప్రయోజనం కలిగిస్తాయి. బంధుమిత్రుల సలహాలు తీసుకోండి. మంచి
పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది.
సంపాదన పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కొందరు స్నేహితులు
తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు
కనిపిస్తాయి. ఐటీ రంగానికి చెందిన వారికి సమయం అనుకూలంగా ఉంది.

Related Posts

Latest News Updates