14 మంది ప్రధానులు మారినా దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల గురించి ఏ నాయకుడు మాట్లాడలేదని, ఢిల్లీలో రైతులు నెలల తరబడి ధర్నాలు నిరసనలు చేశారని గుర్తుచేశారు. రైతుల పోరాటం న్యాయమైందన్నారు. ఢిల్లీ లో రైతులు ధర్నా చేస్తే ఖమహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి ప్రణీత్ తో పాటు పలువురు రైతు నేతలు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందరభంగా వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.లిస్తాన్ ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని ముద్ర వేశారని మండిపడ్డారు.
రైతుల పోరాటం న్యాయబద్ధమైనది. తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదన్నారు. తెలంగాణలో ఏం చేశామో అంతా ఓసారి చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని వారికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవారు అని కేసీఆర్ గుర్తు చేశారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేశాక రైతుల ఆత్మహత్యలు ఆగాయని పేర్కొన్నారు. తెలంగాణలో రైతు అత్మహత్యలు లేవన్నారు. దేశంలో అన్ని ఉన్నాయి, కానీ సింగపూర్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయని, మన దేశం పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు.మన దేశ పరిస్తితి చూసి సిగ్గుతో తల దించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.