మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఈ రోజు అంతా బాగా గడిచిపోతుంది. కొందరు స్నేహితులతో సామరస్య ఏర్పడుతుంది.
ఉద్యోగంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వింటారు. తొందరపడి
నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో కొద్దిగా మాట పట్టింపులు వచ్చే
అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి.
విహారయాత్రకి ప్లాన్ చేస్తారు. కుటుంబంతో కాలక్షేపం చేస్తారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయంలో ఎక్కువ భాగం అనవసర ఖర్చుల మీద వృధా అవుతుంది. పొదుపు చేయడం
మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కుటుంబ
సభ్యులతో విహారయాత్రకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు ఉత్తీర్ణత
సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగంలో
అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4 ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయ పరిస్థితి ఒడిదుడుకులకు లోను అవుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
బంధువులు ఇబ్బంది పెడతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి
వ్యాపారాల వారు ఆర్థికంగా పురోగతి చెందుతారు. ఐటీ నిపుణులకు అధికార యోగం
పట్టే అవకాశం ఉంది. పిల్లలతో కొద్దిగా ఇబ్బంది పడతారు. ప్రేమ వ్యవహారాలు
మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒకేసారి చాలా పనులు పెట్టుకోవడం వల్ల
ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. బంధువులు,
స్నేహితులు సహాయం కోసం ఒత్తిడి చేస్తారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా
ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా
ముందుకు వెళతాయి. డబ్బు జాగ్రత్త.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి
ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఖర్చుల్ని అదుపు చేసుకోవాలి.
పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజ సేవా కార్యక్రమాల్లో
పాల్గొంటారు. బంధు వర్గంలో పలుకుబడి పెరుగుతుంది. ఇల్లు మారాలన్న ఆలోచనను
వాయిదా వేయండి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సింది.
అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లల్లో ఒకరు శుభవార్త
చెబుతారు. ఉద్యోగ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించినంతగా
లాభాలు రాకపోవచ్చు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఇరుగుపొరుగుతో
పేచీలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి వ్యాపారాలు వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగంలో మాత్రం బాగా
కష్టపడాల్సి ఉంటుంది. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి
వస్తుంది. కొందరు రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా బాగానే
ఉంటుంది కానీ అనవసర ఖర్చులు చేయి దాటి పోతాయి. విద్యార్థులు బాగా శ్రమ
పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఒక పట్టాన ముందుకు సాగవు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం
మారటానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల నుంచి ఐటి నిపుణులకు మంచి
కబురు అందుతుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఆదాయం బాగా
పెరుగుతుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. పిల్లలు చక్కని పురోగతి
సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకం గానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి
అందుతుంది. ఉద్యోగ పరంగా చిన్న అదృష్ట యోగం పడుతుంది. కుటుంబ పరంగా శుభ
పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృత్తి నిపుణులకు విదేశీ యోగం పట్టబోతోంది. స్నేహితుల సహాయ సహకారాలు
లభిస్తాయి. తల్లితండ్రుల్లో ఒకరు ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది.
మకరం(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
జీవితానికి సంబంధించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం
పెరగటానికి లేదా అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పెళ్లి
సంబంధం వాయిదా పడే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన
కలిగిస్తుంది. ఉద్యోగ సంబంధంగా విదేశాల నుంచి ఒక శుభవార్త అందుతుంది.
అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులను మెప్పించడానికి బాగా శ్రమ పడాల్సి వస్తుంది. ఆదాయం
నిలకడగా ఉంటుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు.
ఇరుగుపొరుగుతో సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చక్కని
పురోగతి సాధిస్తారు. కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం
మారాలని ఆలోచన చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కూడా
ఆలోచిస్తారు. అయితే అందుకు ఇది సమయం కాదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు అనుకున్నట్టు జరగవు. సమయానికి డబ్బు అందక ఇబ్బంది పడతారు.
ఆర్థిక పరిస్థితి కొద్దిగా తారుమారుగా ఉంటుంది. తల్లిదండ్రులు సహాయం
చేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వారికి
లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ
వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.