నకిలీ ఔషధ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విరుచుకుపడింది.మొత్తం 20 రాష్ట్రాల్లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దాడులు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 76 ఫార్మా కంపెనీల్లో ఈ సోదాలు జరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే… 18 నకిలీ ఫార్మా కంపెనీలపై ఉక్కుపాదం మోపి, వాటి లైసెన్స్ ను రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే 26 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు కలిపే ఈ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫార్మా కంపెనీలపై దాడులు జరగొచ్చని కొన్ని రోజులుగా తీవ్రంగానే ప్రచారం జరుగుతోంది. కానీ… ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియలేదు. ఆకస్మికంగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు మంగళవారం దేశ వ్యాప్తంగా దాడులు చేయడం సంచలనం రేపుతోంది.