BSF జవాన్లపై బంగ్లాదేశీయులు దాడి చేశారు. బంగ్లాతో వున్న అంతర్జాతీయ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సిబ్బందిపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పరిధిలో దాడి చేశారు. ముర్షీదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ సెక్టార్ లో వున్న నిర్మల్చర్ ఔట్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. భారత్ వైపు వున్న పొలాల్లోకి తమ పశువులను తరలించడానికి బంగ్లాదేశీయులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ రైతులకు కోపం వచ్చింది. బీఎస్ఎఫ్ జవాన్లపై ఆయుధాలు, కట్టెలతో జవాన్లపై దాడికి దిగారు. దాదాపు 100 మంది బంగ్లాదేశీయులు ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బంగ్లా దేశీయుల దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని బీఎస్ఎఫ్ పేర్కొంది.
