భారత సైన్యానికి చెందిన చిరుత హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్ లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డితో పాటు కో పైలట్ మేజర్ జయంత్ కూడా మరణించినట్లు ఆర్మీ ప్రకటించింది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చీతా ఎయిర్ క్రాఫ్ట్ సంగే గ్రామం నుంచి అసోం సోనిట్ పూర్ జిల్లా వైపు వెళ్లింది. అయితే… పావు గంటకే ATC నుంచి హెలికాప్టర్ కి సంబంధాలు తెగిపోయాయి.
దీంతో అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ కామెంగ్ జిల్లా మండాలా వద్ద ప్రమాదానికి గురైందని ఆర్మీ పేర్కొంది. అయితే.. మొదట్లో ఇద్దరు పైలెట్ల ఆచూకీ గల్లతైంది. దీంతో కూలిపోయిన పైలట్ల కోసం ఆచూకీ మొదలైంది. చివరికి అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ ప్రాంతం వద్ద కాలిపోతున్న ఛాపర్ శకలాలను గ్రామస్థులు గుర్తించారు. దీంతో అధికారులు అక్కడి చేరుకొని, పైలట్, కో పైలట్ మరణించినట్లు ప్రకటించారు.