Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

24న రెండు బ్లాక్ బస్టర్స్ “మిరపకాయ్”, “అలా మొదలైంది” రీ రిలీజ్

ఈ నెల 24న ప్రేక్షకాభిమానులకు పండగే పండగ. ఒకటి కాదు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు అదే రోజున రీ రిలీజ్ కానున్నాయి. మాస్ మహారాజా రవితేజ, అందాల భామలు రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన “మిరపకాయ్” సినిమా ఒకప్పుడు ఎంతగా అలరించిందో తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన రవితేజకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. నాగబాబు, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, అజయ్ తదితర ఆర్టిస్టులు తమ తమ పాత్రలలో జీవించారు. తమన్ సంగీతం వీనులవిందు చేస్తుంది. ఇలాంటి చక్కటి దృశ్యరూపం 24వ తేదీ సందడి చేయబోతోంది.

ఈ కోవలోనే ప్రేక్షకులను ఓలలాడించిన మరో బ్లాక్ బస్టర్ “అలా మొదలైంది” సినిమా కూడా 24న రీ రిలీజ్ కానుంది. నేచురల్ స్టార్ నాని బర్త్ డేని పురస్కరించుకుని ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు గ్లామర్ తో పాటు నటనాపఠిమ కలిగిన నిత్యా మీనన్ ఇందులో నానికి జోడీగా నటించగా, బి.వి.నందినిరెడ్డి దర్శకత్వంలో శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఒక చిన్న సినిమాగా విడుదలై, అప్పట్లో ఎంతటి అద్భుత విజయం సాధించిందో వేరుగా చెప్పనక్కర లేదు. ఇందులోని ఇతర ముఖ్య పాత్రలలో స్నేహా ఉల్లాల్, రోహిణి, ఆశిష్ విద్యార్థి తమ తమ పాత్రలలో ఒదిగిపోయిన వైనం సినిమాకు మరింత వన్నె తెచ్చింది. మొత్తం మీద ఈ రెండు సినిమాలు థియేటర్లలో స్పెషల్ షోస్ తో సందడి చేయబోతున్నాయి.

Related Posts

Latest News Updates