దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 57 మంది సభ్యుల్లో 27 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వారందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయల్ వున్నారు. ఇక.. జైరాం రమేశ్, వివేక్ టంఖా, ముకుల్ వాస్నిక్ వున్నారు. బీజేపీ నుంచి కె. లక్ష్మణ్, సురేంద్ర సింగ్, లక్స్మీకాంత్ వాజపాయి, జయంత్ చౌదరీ, కల్పనా సైనీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇందులో 12 మంది హిందీలో, నలుగురు ఆంగ్లంలో, సంస్కృతం, కన్నడ, మరాఠీ, ఒడియా భాషల్లో ఇద్దరేసి చొప్పున ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబీ, తమిళం, తెలుగులో ఒక్కరేసి చొప్పున ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పార్లమెంట్ లో జరిగే అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని సూచించారు. సభ నిబంధలకు కట్టుబడి నడుచుకోవాలని, సభ గౌరవాన్ని మరింత ఇనుమడింప జేయాలని నూతన సభ్యులకు వెంకయ్య నాయుడు సూచించారు.